హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్ల బెడదను నివారించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసింది. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌తో కూడిన మెమోలను ముద్రించి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మెమోలపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌చేస్తే.. అవి అసలైనవో, నకిలీవో ఇట్టే తెలిసిపోతుంది. ఇలాంటి స్మార్ట్ సర్టిఫికెట్స్ ముద్రణను, అందుకు అవసరమైన హైస్పీడ్ ప్రింటర్లను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కే సీతారామారావు శుక్రవారం ప్రారంభించారు.
డిగ్రీ, పీజీ మెమోలను నిమిషాల వ్యవధిలోనే విద్యార్థులకు అందించడం ఈ హైస్పీడ్ ప్రింటర్ల ప్రత్యేకత. ఇదివరకు విద్యార్థుల మెమోల్లో కొన్నింటిని వర్సిటీలో, మరికొన్నింటిని విజయవాడలోని ప్రభుత్వ ముద్రణాలయంలో ముద్రించేవారు. వాటిని విద్యార్థులకు అందించేందుకు 5 నుంచి 7 రోజుల వరకు సమయం పట్టేది. తాజాగా హైస్పీడ్ ప్రింట ర్లు అందుబాటులోకి రావడంతో మొత్తం మోమోలను వర్సిటీలోనే ముద్రించనున్నారు. దీంతో దరఖాస్తు చేసిన రోజే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేకతలు