ఒక్కరోజులో 2425 మంది రక్తదానం.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒక్కరోజులో అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసి జాతీయ రికార్డును సృష్టించారు. ఈ శిబిరంలో మొత్తం 2,425 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, సినీ కార్మికులు రక్తదానం చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా ప్రతినిధి వసుధ అశోక్ చేతుల మీదుగా కార్యక్రమ నిర్వహకులు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రికార్డు ధ్రువీకరణ సర్టిఫికేట్‌ను అందుకున్నారు.
గత ఏడాది మంత్రి కేటీఆర్ జన్మదినం రోజున ఇక్కడే 2,200 మంది రక్తదానం నిర్వహించి నెలకొల్పిన రికార్డుని చెరిపేయడం విశేషం. సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ జాయింట్ సెక్రటరీ అలీమ్ బేగ్‌తో పాటు కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, సీ.ఎన్ రెడ్డి, దీదీప్య రావు, బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

