హైదరాబాద్, ఫిబ్రవరి3 (నమస్తే తెలంగాణ): బెంగళూరులో బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు బుధవారం సమావేశం కానున్నారు. వైస్చాన్స్లర్లు, ప్రొఫెసర్ల ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్పై యూజీసీ విడుదల చేసిన ముసాయిదాపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. యూజీసీ ముసాయిదాను వ్యతిరేకిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి మంత్రి శ్రీధర్‌బాబు, విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన హాజరయ్యే అవకాశముంది.
పని గంటల పెంపు ప్రతిపాదన లేదు ; పార్లమెంటుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: ఉద్యోగుల పని గంటలను పెంచాలనే ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలిపింది. కార్మి క, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, వారానికి గరిష్ఠ పని గంటలను 70 లేదా 90 గంటలకు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. ఇది కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి జాబితాలోని అంశమని చెప్పా రు. కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలు తమ అధికార పరిధులలో కార్మిక చట్టాలను అమలు చేస్తాయన్నారు. కేంద్ర ప్రభు త్వ పరిధిలో ఈ చట్టాలను సెంట్రల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెషినరీ తనిఖీ అధికారులు, రాష్ర్టాలు తమ కార్మిక శాఖ అధికారుల ద్వారా అమలు చేస్తాయని తెలిపారు.