గడ్కరీతో బీఆర్ఎస్ ఎంపీల భేటీ
ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు సమస్యలపై బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఢిల్లీలో కేంద్ర రహదారులు
- ఖమ్మం జిల్లాలో రోడ్ల సమస్యలపై వినతి
- సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు సమస్యలపై బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తులపై గడ్కరీ సానుకూలంగా స్పందించి అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసినట్టు ఎంపీలు పేర్కొన్నారు.
వినతిపత్రంలో కోరిన అంశాలు
- సత్తుపల్లి నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా వేంసూరు, కల్లూరు మండలాల్లో ఎగ్జిట్ లేదు. వెంటనే ఏర్పాటు చేయాలి.
- సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం పినపాక స్టేజీ వద్ద నుంచి తల్లాడ వరకు, వీఎం బజార్ నుంచి మండాలపాడు (లంకపల్లి), కిష్టాపురం నుంచి సత్తుపల్లి, సత్తుపల్లి నుంచి బేతుపల్లి మీదుగా గంగారం వరకు రహదారిని నాలుగు లేన్లుగా, కల్లూరులో ఆరు లేన్లుగా విస్తరించాలి.
- సత్తుపల్లి శివారు తాళ్లమడ మధ్యలో తమ్మిలేరు వాగుపై ఫోర్లేన్ బ్రిడ్జి
- ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనం పక్కనుంచి ప్రతిపాదిత నాగపూర్-అమరావతి హైవే అలైన్మెంట్ మార్చాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

