హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ, ప్రైవేటు సేవలను ఆన్లైన్లో అందిస్తున్న మీ సేవ ఖాతాలో మరో రికార్డు చేరింది. శుక్రవారం ఒక్క రోజే 2,20,172 లావాదేవీలు నమోదైనట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం వెల్లడించారు. ప్రతీరోజు 70 నుంచి 80 వేల కార్యకలాపాలు మీసేవ ద్వారా నమోదవుతాయని, శుక్రవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.
అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2027’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను శనివారం ఆయన ప్రారంభించారు.