హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్ర చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడిని పక్కనబెట్టి.. ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ముం దుకుతేవడం తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతున్నదని సోమవారం ఎక్స్‌లో దుయ్యబట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేతగాని దద్దమ్మలని ఢిల్లీ కాంగ్రెస్ తేల్చేసిందని దెప్పిపొడిచారు. అటు ఢిల్లీలో ఆ పార్టీ అధిష్ఠానం.. ఇటు గల్లీలో తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కారును నమ్మడం లేదనే విషయం అందరికి తెలిసిపోయిందని తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా రేవంత్ సర్కారుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.