హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని అధిష్ఠానం పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్‌ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జా రీ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె సుధీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో పని చే స్తున్నారు. నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిశీలకురాలిగా వ్యవహరించారు. పార్టీ పదవుల ఎంపిక లో, ఇతర అంశాల్లో ఇన్చార్జి దీపాదాస్ మున్షీ జోక్యం ఎక్కువైందనే విమర్శలు వినిపించాయి. సీఎం రేవంత్‌రెడ్డికి, ఆమె కు మధ్య గ్యాప్ కూడా ఏర్పడినట్టుగా ప్ర చారం ఉంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆమెను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.