నందికొండ, జూన్ 17 : నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలో నూతనంగా నిర్మించిన బుద్ధవనంలో ఆదివారం నుంచి ధ్యాన తరగతులు ప్రారంభిస్తున్నట్టు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు, 12.30 నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి 4.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు 4 బ్యాచ్‌లకు తరగతులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ధమ్మనాగార్జున విపస్సన కేంద్రం ఆధ్వర్యంలో మహాస్తూపం మొదటి అంతస్తులో తరగతులు జరుగుతాయని తెలిపారు.