రాజన్నసిరిసిల్ల, మే 16 (నమస్తే తెలంగాణ) : ఈ-ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ల చేపడుతున్నామని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం అసోసియేషన్ కార్యవర్గం ఆధ్వర్యంలో బంద్కు చెందిన కరపత్రాలను రాజన్నసిరిసిల్లలో ఆవిషరించారు. దేశ వ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా మెడికల్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగిస్ట్స్ అనుబంధంగా ఉన్న తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కేంద్రం వైఖరికి నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు.
ఈ-ఫార్మసీ విక్రయాలు, నకిలీ ప్రిస్రిప్షన్తో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉన్నదన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరినా కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. కొవిడ్ కాలంలో జారీచేసిన తాత్కాలిక నోటిఫికేషన్ జీఎస్ఆర్ 220 (ఈ), ఈ-ఫార్మసీలకు సంబంధించిన జీఎస్ఆర్ 817(ఈ) నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.