వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) దవాఖానలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఎనిమిది నెలలుగా ఎంజీఎంకు కొత్తగా వైద్య పరికరాలు రాలేదు. ఉన్నవాటి నిర్వహణనూ పట్టించుకోవడం లేదు. వ్యాధుల నిర్ధారణ పరీక్షలు అరకొరగానే నిర్వహిస్తున్నారు. దీంతో పరీక్షల కోసం పేద రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన రూ.1000 కోట్ల కుంభకోణం కేసును హైదరాబాద్ సీసీఎస్ నుంచి సీఐడీకి బదిలీ చేశారు. ఇందులో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులపై కేసు నమోదైంది.
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయశాఖలో ఉద్యోగుల బదిలీలు మళ్లీ వాయిదాపడ్డాయి. అధికారులు రుణమాఫీ ప్రక్రియలో బిజీ గా ఉండడంతో కౌన్సెలింగ్‌కు సమయం సరిపోవడం లేదని ప్రభుత్వానికి చెప్పినట్టుగా తెలిసింది. దీంతో ఆగస్టు 15 వరకు సమయం ఇవ్వాలని కోరగా, అందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం. వాస్తవానికి ఈనెల 24న బదిలీల ప్రక్రి య ముగిసింది. అయితే వ్యవసాయ శాఖ లో రుణమాఫీ ప్రక్రియ బదిలీలపై ప్రభా వం చూపడంతో ఈ నెల 31వరకు గడు వు పెంచారు. తాజాగా అదే సమస్య ఉత్ప న్నం కావడంతో మరోసారి గడువును పొడిగించారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.