హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం గుండెపోటు వచ్చిన రాజేందర్.. యశోద దవాఖానలో చికిత్సకోసం చేరారు. చికిత్స పొందుతున్న రాజేందర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. రాజేందర్ మృతి పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సంతాపం ప్రకటించారు.