హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ ఆదేశించారు. సోమవారం ఆయ న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఆర్అండ్బీ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు.