హైదరాబాద్ : గంజాయి (Gganja )కట్టడిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ నిఘా పెంచుతున్నారు. తాజాగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు(Medchal police) పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి అల్వాల్(Alwal)కు గంజాయి తీసుకొస్తున్న అనకాపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ.9లక్షల విలువైన 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.