Heart Attack | చేగుంట: గల్ఫ్ దేశమైన దుబాయ్‌లో విషాదం నెలకొంది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన చింతకింది సాయి కిరణ్ (35) దుబాయ్‌లో గుండెపోటుతో మృతిచెందాడు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వడియారం గ్రామానికి చెందిన సాయికిరణ్‌కు కొన్నేళ్ల కిందట నాగలక్ష్మీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఉపాధి కోసం గత ఏడాది మే నెలలో సాయికిరణ్ దుబాయ్‌కు వెళ్లాడు. అయితే ఈ నెల 2వ తేదీ సాయికిరణ్‌కు గుండపోటు వచ్చి అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు ఇటీవల ఇండియాలోని కుటుంబసభ్యులకు సమాచారం అందింది.
సాయికిరణ్ మరణవార్త తెలియడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, దుబాయ్‌లో మరణించిన సాయికిరణ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని బాధితులు సంప్రదించారు. వీలైనంత తొందరగా సాయికిరణ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలని కోరారు.