రియల్టర్ శ్రీనివాస్ హత్యకేసు ఛేదించిన పోలీసులు

మెదక్ : జిల్లాలో కలకలం రేపిన రియల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారులో ప్రధాన రహదారి పక్కన కారుతో పాటు డిక్కీలో పూర్తిగా కాలిపోయి ఉన్న శవం మంగళవారం దొరికిన విషయం తెలిసిందే. మృతుడిని మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ శ్రీనివాస్(45)గా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హత్య కేసు వివరాలు ఎస్పీ చందనదీప్తి వెల్లడించారు. శ్రీనివాస్‌ను నిఖిల్, శివ, పవన్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసినట్లు నిర్ధారణ అయిందన్నారు. విచారణలో ప్రధాన నిందితుడు శివగా తేలిందన్నారు. ఇతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. హత్యకు కారణం మాత్రం పూర్తిగా నిర్ధరణ కాలేదన్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఆధారాలు లభించిన తర్వాతే హత్యకు గల కారణంగా కచ్చితంగా చెప్పొచ్చన్నారు. శ్రీనివాస్ గొంతు కోసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉందని తెలిపిన ఎస్పీ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కారులో పెట్టి దగ్ధం చేసినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

