మెదక్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : మెదక్ మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్య లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌కు చెందిన గెల్లి శైలజ సర్వే నంబర్ 505/1/1/2లో 60 5 గజాల ఓపెన్ ప్లాట్‌ను అక్క పేరు మీద నుంచి తన పేరు మీదకు మ్యుటేషన్ చేయడానికి మెదక్ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుం ది. మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎన్ జానయ్య రూ.20వేలు లంచం డిమాం డ్ చేయగా రూ.12వేలకు ఒప్పందం కుదిరింది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో శైలజ తమ్ముడు శ్రీ నివాస్ నుంచి ఆర్ఐ రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జానయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.