నర్సాపూర్, నవంబర్ 14 : మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీకి బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, కౌన్సిలర్, 231 మంది శక్తి కేంద్రాల ఇన్చార్జి లు, రెండు మండలాల అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి మురళీయాదవ్ తీరును నిరసిస్తూ రాజీనామా చేసినట్టు గోపీ మంగళవారం మీడియాకు వెల్లడించారు. నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేశానని గుర్తుచేశారు. రాష్ట్ర నాయకులు తమ స్వప్రయోజనాల కోసం సిద్ధ్దాంతాలను పక్కన పెట్టి, టికెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈటల రాజేందర్ సిద్ధ్దాంతాలను పక్కన పెట్టి కులరాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.