చిగురుమామిడి, ఫిబ్రవరి 20: తాగునీరందడం లేదని ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేయడం, దీనిపై ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో కథనం ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం కదిలింది. మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ప్రత్యేకాధికారి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో మధుసూదన్, భగీరథ ఈఈ రామ్‌కుమార్ పర్యటించా రు. తాగునీరందని ప్రాం తాలను గుర్తించారు. గ్రామస్థులతో మాట్లాడా రు. సాధ్యమైనంత తొందరలో నీటి సరఫరాకు చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీరి వెంట ఎంపీవో శ్రవణ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు వినయ్, శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఉన్నారు.