హైదరాబాద్, సెప్టెంబర్21 (నమస్తే తెలంగాణ) : రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, తాసీల్దార్లు, వీఆర్వోలు, రీడిప్లాయిడ్ వీఆర్వోల అసోసియేషన్లు, వీఆర్ఏ హ కుల సాధన సమితి, రెవెన్యూ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్లతో మంత్రి పొంగులేటి శనివారం సమావేశమయ్యారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 29న తాసీల్దార్లు, అక్టోబర్ 6న డిప్యూటీ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ అయిన తాసీల్దార్లు, 317జీవో బాధితులను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని, అన్నిస్థాయిల్లో అర్హులకు పదోన్నతులు కల్పించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మంత్రికి విజ్ఞప్తి చేశాయి.