హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునే సమయానికి మిల్లుల్లో ఖాళీ స్థలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. సోమవారం నమస్తే తెలంగాణలో ‘యాసంగి ధాన్యానికి చోటేది..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆ శాఖ వివరణ ఇచ్చింది. నిరుడు యాసంగికి చెందిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేసినట్టు పేర్కొంది. వేలంలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు క్రమంగా ధాన్యాన్ని తరలిస్తున్నాయని తెలిపారు. యాసంగి కొనుగోళ్లు వేగం పుంజుకునేలోపు మిల్లుల్లో ధాన్యం నిల్వలకు అవసరమైన స్థలాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.