హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ 2025-26 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. మెరిట్ లిస్టులో అభ్యంతరాలుంటే సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా ఫిర్యాదులను పంపాలని వర్సిటీ తెలిపింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 970 మంది ఉద్యోగులను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కాంట్రాక్ట్, గెస్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఏడాది కాలానికి కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. 420 మంది కాంట్రాక్ట్, 51 మంది పార్ట్‌టైమ్(అవర్లీ), 42 మంది పార్ట్‌టైమ్(కన్సాలిడేటెట్ పే), 56 మంది ఔట్సోర్సింగ్, ముగ్గురు మినిమం టైం స్కేల్, 398 మంది గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది.