వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 4: మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ రెండో విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రకియ సోమవారం పూర్తయినట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆగస్టు 30న ఇచ్చిన కన్వీనర్ కోటా రెండో విడుత నోటిఫికేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు నిర్వహించినట్టు చెప్పారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళాశాలల ద్వారా గరిష్ఠంగా 2,66,945 ర్యాంకు సాధించిన అభ్యర్థికి సీటు ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఓపెన్ లోకల్ క్యాటగిరీలో 1,59,419 ర్యాంకు, అన్రిజర్వ్డ్ (యూఎన్ఆర్)లో 56,089, ఈడబ్ల్యూస్లో 1,42,345, ఎస్సీ విభాగంలో 2,43,666, యూఎన్ఆర్లో 1,53,278, ఎస్టీ విభాగంలో 2,28,912, యూఎన్ఆర్ కోటా 1,89,737, బీసీ (ఏ)లోకల్ కోటాలో 2,56,783, యూఎన్ఆర్ కోటాలో 1,00,511, బీసీ (బీ) లోకల్ కోటాలో 1,82,579, యూఎన్ఆర్లో 87.927, బీసీ(సీ) లోకల్లో 2,66,945, యూఎన్ఆర్లో 87,927, బీసీ(డీ) లోకల్ లో 1,75,332, యూఎన్ఆర్లో 78,569, బీసీ(ఈ) లోకల్లో 1,84,057, యూఎన్ఆర్లో 1,12,071, మైనారిటీ లోకల్ క్యాటగిరీలో 1,82,683, యూఎన్ఆర్లో 1,14,331 ర్యాంకులకు సీట్లు ఇచ్చారు.