హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సీట్లు, కాలేజీలు ఓయూ పరిధిలోనే అధికంగా ఉన్నాయి. ఓయూలో ఎంబీఏ సీట్లు 11,007, ఎంసీఏ సీట్లు 1,452 కాగా, జేఎన్టీయూలో ఎంబీఏ సీట్లు 5,342, ఎంసీఏ సీట్లు 102 ఉన్నాయి. కాకతీయ వర్సిటీలో ఎంబీఏ సీట్లు 1,974, ఎంసీఏ సీట్లు 468 అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏలో 20వేల సీట్లుంటే, ఎంసీఏలో 2వేల సీట్లున్నాయి. ఈ సీట్లను 70శాతం కన్వీనర్, 30శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీచేస్తారు. కన్వీనర్ కోటా కింద 85శాతం సీట్లను స్థానిక కోటాలో, 15శాతం ఆన్‌రిజర్వ్‌డ్ కోటాలో నింపుతారు.
ఐసెట్ కౌన్సెలింగ్ షురూ..
ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. శనివారం తొలిరోజు 14,284 మంది అభ్యర్థులు స్లాట్‌బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ నెల 12 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్‌బుకింగ్‌కు అవకాశం ఉన్నది. ఈ నెల 10 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 15వరకు వెబ్ ఆష్షన్లు ఇవ్వొచ్చు.