Rajeev Sagar | ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ఓటమి తథ్యం : మేడే రాజీవ్ సాగర్
Rajeev Sagar | అవినీతికి, స్కాములకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ నిలుస్తుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్( Rajeev Sagar |) దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా బెంగళూరులోని కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో పట్టుబడ్డ రూ. 42 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. కర్ణాటకలో గెలిచి ఆరు మాసాలు గడవక ముందే వసూళ్ల పర్వానికి తెరలేపారని విమర్శించారు.
హైదరాబాద్ : అవినీతికి, స్కాములకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ నిలుస్తుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్( Rajeev Sagar |) దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా బెంగళూరులోని కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో పట్టుబడ్డ రూ. 42 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. కర్ణాటకలో గెలిచి ఆరు మాసాలు గడవక ముందే వసూళ్ల పర్వానికి తెరలేపారని విమర్శించారు. అక్కడ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తెలంగాణలో గెలువాలని చూస్తుందని మండిపడ్డారు.
తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని అందుకే వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందన్నారు. అందులో భాగంగానే అక్కడి బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి అక్కడి నుంచి వేల కోట్లు వసూలు చేసిన డబ్బులను తెలంగాణకు తరలిస్తున్నారని విమర్శించారు. నేడు తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి అక్రమంగా డబ్బు తరలించి దొరికిన కాంగ్రెస్ పార్టీ.. రేపు తెలంగాణలో అధీకారంలోకి వస్తే ఇదే తరహాలో ఇతర రాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ నుంచి అక్రమంగా డబ్బు తరచించడం ఖాయమన్నారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. ఇతర రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని, అందుకే ఇంతవరకు ఒక్క అభ్యర్థిని సైతం ప్రకటించలేదని విమర్శించారు. ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అసలు అభ్యర్థులనే ప్రకటించని కాంగ్రెస్ పార్టీలో డజనుకు పైగా నేతలు సీఎం పదవి కోసం పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

