న్యూఢిల్లీ: పార్లమెంట్(Parliament)లో రెండో రోజు కూడా విపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ ఇవాళ పలుమార్లు వాయిదా పడ్డాయి. కాక్రోచ్ పార్టీ ఆందోళనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ఆలకించాలన్నారు. పేపర్ లీకేజీలపై స్వరం వినిపిస్తున్న విద్యార్థులను చితకబాదారని, వాళ్లంతా ఇప్పుడు ఆస్పత్రుల్లో ఉన్నారని, వారి సమస్యలను పట్టించుకోవాలని ఖర్గే అన్నారు. గందరగోళం నేపథ్యంలో తొలుత 12 గంటల వరకు , ఆ తర్వాత కూడా మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్‌సభలోనూ గందరగోళం నెలకొన్నది. తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. 12 తర్వాత కూడా విపక్షలు లోక్‌సభలో పట్టుపట్టాయి. సభా కార్యక్రమాలను యావత్ దేశ ప్రజలు చూస్తున్నారని, ప్రతి ఒక్కరూ తమ సీట్లలో కూర్చోవాలని, సమావేశాలు సజావుగా సాగనివ్వాలని, ఇది సరైన ప్రవర్తనేనా అంటూ చైర్పర్సన్ సంధ్యా రాణి ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదావేశారు.
#MonsoonSession2026 #LokSabha adjourned to meet again at 02:00 PM@ombirlakota @LokSabhaSectt @loksabhaspeaker pic.twitter.com/1SIjIUjJfp
— SansadTV (@sansad_tv) July 21, 2026