హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో మే 4న ‘జాతీయ ప్రార్థనా దినోత్సవాన్ని’ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వెల్లడించారు. దేశ నలుమూలల నుంచి క్రైస్తవ సంఘ నాయకులు, బిషప్లు, పాస్టర్లు, పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రం, దేశ సంక్షేమం కోసం ఐకమత్యంతో ప్రార్థనలు నిర్వహించే ఈ కార్యక్రమంలో రెవ. పాల్ తంగయ్య వాక్యోపదేశం చేస్తారని పేర్కొన్నారు. ఆదివారం ఈస్టర్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.