హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మారిషస్ విదేశాంగశాఖ సహాయమంత్రి హంబైరాజన్ నర్సింగెన్ బుధవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పదేండ్ల పాలనలతో తెలంగాణ అభివృద్ధి చెందిన తీరుపై చర్చించారు. భవిష్యత్తులో తెలంగాణ-మారిషస్ మధ్య వాణిజ్య విస్తరణకు గల అవకాశాలు, పెట్టుబడులు, పరస్పర సహకారం లాంటి అంశాలపై కీలకంగా చర్చించామని కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మారిషస్ విదేశాంగశాఖ సహాయమంత్రి హంబైరాజన్ నర్సింగెన్తో సమావేశం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.