హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలు సహా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాస్లర్‌ప్లాన్లను రూపొందించే ప్రక్రియ చురుకుగా సాగుతున్నదని, డిసెంబర్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని మున్సిపల్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 74 పురపాలక సంఘాలకు మాస్టర్ప్లాన్లు అమలులో 13వ పేజీలో
ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన 68 పురపాలక సంఘాల్లో మహబూబాబాద్, అందోల్-జోగిపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవరకొండ పట్టణాల మాస్టర్ప్లాన్లు సిద్ధమయ్యాయని, వాటిని ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపామని వెల్లడించారు. ప్రభుత్వానికి పంపేందుకు మరో 15 మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 45 పట్టణాల మాస్టర్ప్లాన్లను యుద్ధప్రాతిపదికన తయారు చేస్తున్నామని వివరించారు.
రెండు రివైజ్డ్ ప్లాన్లకు ఆమోదం
ఇప్పటికే మాస్టర్ప్లాన్లు అమలులో ఉండి కాలపరిమితి ముగిసిన 27 పట్టణాల్లో రెండు పట్టణాలకు సంబంధించిన రివైజ్డ్ మాస్టర్ప్లాన్లను ప్రభుత్వం ఆమోదించిందని, మరో రెండు పట్టణాల రివైజ్డ్ మాస్టర్ప్లాన్లను ఆమోదం కోసం పంపామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగిలిన 23 పట్టణాల మాస్టర్ప్లాన్లను కూడా త్వరలో రివైజ్ చేసి ఆమోదం కోసం డిసెంబర్‌లోగా ప్రభుత్వానికి పంపుతామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూపొందిస్తున్న వాటిలో 54 మాస్టర్ప్లాన్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం), గ్రామీణ పట్టణ ప్రణాళికా శాఖ డైరెక్టరేట్‌తో కలిసి సంయుక్తంగా రూపొందిస్తున్నట్టు చెప్పారు. మరో 10 పట్టణాల మాస్టర్ప్లాన్లను ‘అమృత్’ పథకం కింద, 20 మాస్టర్ప్లాన్లను తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద రూపొందిస్తున్నట్టు వివరించారు.
మాస్టర్ప్లాన్ల స్థితిగతులు
రాష్ట్రంలోని మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు : 142
ఇప్పటికే మాస్టర్‌ప్లాన్ అమల్లో ఉన్న పట్టణాలు : 74
ప్రభుత్వ ఆమోదానికి పంపిన మాస్టర్ప్లాన్లు : 8
ఆమోదానికి పంపేందుకు సిద్ధమైనవి : 15
మాస్టర్ప్లాన్లు తయారవుతున్న పట్టణాలు : 45