ప్రభుత్వ నిర్లక్ష్యం రోగులకు శాపం
ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పసిప్రాణాలను బలితీసుకున్నది. చిన్నారుల మరణాలతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చికిత్స కోసం తమ పిల్లలను దవాఖానకు తీసుకెళ్తే విగతజీవులుగా మారారని రోదిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్సీఎన్యూలో 27 మంది శిశువులు చికిత్స పొందుతుండగా, బుధవారం మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
- గాలిలో దీపంలా ప్రజల ప్రాణాలు
- రిమ్స్ నిర్వహణ అస్తవ్యస్తం
- వైద్యులు, సిబ్బంది కొరత
- ప్రైవేట్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందుల కొనుగోలు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పసిప్రాణాలను బలితీసుకున్నది. చిన్నారుల మరణాలతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చికిత్స కోసం తమ పిల్లలను దవాఖానకు తీసుకెళ్తే విగతజీవులుగా మారారని రోదిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్సీఎన్యూలో 27 మంది శిశువులు చికిత్స పొందుతుండగా, బుధవారం మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. రిమ్స్ ఘటన ప్రభుత్వ దవాఖానల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. దవాఖానల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్యులు, సిబ్బంది కొరత, మందుల కొరత, రోగులు చికిత్స పొందే వార్డుల్లో విద్యుత్తు వైర్లు సరిగా లేకపోవడం, భవనాలు ప్రమాదకరంగా మారడంతో రోగులు, వారి సహాయకులు భయపడుతున్నారు. రిమ్స్‌లో నవజాత శిశువులకు చికిత్సలు అందించే స్పెషల్ కేర్ నియోనటల్ యూనిట్ (ఎస్సీఎన్యూ)లో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారుల మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి నివేదికలను అందించాలని వైద్య శాఖకు సూచించింది.
రిమ్స్ నిర్వహణ అస్తవ్యస్తం
ఆదిలాబాద్ రిమ్స్‌లో 750 పడకలు ఉండగా, రోజుకు 800 వరకు అవుట్ పేషెంట్లు వస్తుంటారు. 400 నుంచి 500 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతారు. దవాఖానలో వివిధ విభాగాల్లో 350 మంది వైద్యులు అవసరం కాగా, 150 మందితో సేవలు అందిస్తున్నారు. డైరెక్టర్, సూపరింటెండెంట్, ఆర్ఎంవో, డిప్యూటీ సూపరింటెండెంట్ బాధ్యతలను ఒక్కరే చూస్తుండటంతో పనిభారం ఎక్కువగా ఉంటుంది. దవాఖానలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి పరిసరాల నుంచి దుర్వాసన వస్తున్నది.
నర్సులు, ఇతర విభాగాల సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో పేదలకు సరైన వైద్యసేవలు అందడం లేదు. ప్రజలకు వైద్యం అందించడానికి వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలు సరిగా జరుగకపోవడం, రోగులకు అవసరమైన మందులు అందుబాటులోకి లేకపోవడంతో పేదలు ప్రైవేట్ ల్యాబ్‌లు, మెడికల్ దుకాణాలకు పోయి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సేవలను నెట్టుకొస్తున్నారు.
ప్రమాదానికి కారణాలు
రిమ్స్‌లో పలు విభాగాల్లో 130 ఏసీలు ఉన్నాయి. వీటిల్లో చాలా ఏసీలు పదేండ్ల క్రితం నాటివి. అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. 750 బెడ్స్ ఉన్న దవాఖానలో ముగ్గురు ఎలక్ట్రీషియన్లు పనిచేస్తున్నారు. కరెంటు వైర్లు ఎక్కడికక్కడ వేలాడుతుంటాయి. ఏసీల వినియోగంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా 24 గంటలు వీటిని నడిపిస్తున్నారు. లోడ్‌కు అనుగుణంగా ఏసీలను చల్లబర్చడానికి కూలింగ్ గ్యాస్ ఉన్నదా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఏసీలకు మరమ్మతులు చేయడం లేదు. వాటిని పరిశీలించి లోపాలు సరిదిద్దడం లేదు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ జరిగితే ఎంసీసీలు స్విచ్‌లో నిలిచిపోవాల్సి ఉండగా, ఎంసీసీలు కనిపించడం లేదు. ఏసీల్లోని లోపాలకు తోడు అధికలోడ్ కారణంగా చిన్న పిల్లల వార్డులో ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

