మహదేవపూర్, జూన్ 3: భారీ నీటిపారుదల శాఖ కాళేశ్వరం ప్రాజెక్టు మహాదేవపూర్ డివిజన్-1 పరిధిలో పలువురు అధికారులు, సిబ్బంది బుధవారం బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. డివిజన్-1లో విధులు నిర్వర్తిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) (మేడిగడ్డ బరాజ్) తిరుపతిరావుతో పాటు ఆరుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్ ఏఈఈలు) గణేశ్, పవన్, భరత్, విజయ్, సాయిచరణ్, శిరీష్ బదిలీ అయ్యారు. వీరితోపాటు ఇద్దరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈలు) సూర్యప్రకాశ్ (కన్నెపల్లి పంపుహౌస్), భీమ్రావు (మేడిగడ్డ బరాజ్), మహదేవపూర్ మండల కేంద్రంలోని డివిజన్ కార్యా లయంలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు దామోదర్, రాజయ్య స్థానచలనం పొందారు. ఒకేసారి పలువురు అధికారులు, సిబ్బంది బదిలీ కావడంతో డివిజన్ కార్యాలయంలో కొంత ఖాళీలు ఏర్పడ్డాయి. వీరి స్థానాల్లో కొత్తగా అధికారులు, సిబ్బందిని నియమించాల్సి ఉన్నది.