Cyber Crimes | అందమైన అమ్మాయి నుంచి ఫోన్‌కాల్ వచ్చిందా? వాయిస్ స్వీట్‌గా ఉందని నమ్మితే ఇక అంతే సంగతులు!!
తెలియని నంబర్ నుంచి కాల్ చేస్తారు.. పురుషులైతే అమ్మాయిలు, స్త్రీలు అయితే అబ్బాయిలు మాట్లాడుతారు.. ఎవరండీ! అని అడగ్గానే.. అయ్యయ్యో! తెలిసిన వారికి కాల్ చేయబోయి మీకు రాంగ్ కాల్ వచ్చిందని బుబ్జి బుజ్జి మాటలు చెప్తారు. సారీ! అని తియ్యగా మాట్లాడుతారు.
Cyber Crimes | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలియని నంబర్ నుంచి కాల్ చేస్తారు.. పురుషులైతే అమ్మాయిలు, స్త్రీలు అయితే అబ్బాయిలు మాట్లాడుతారు.. ఎవరండీ! అని అడగ్గానే.. అయ్యయ్యో! తెలిసిన వారికి కాల్ చేయబోయి మీకు రాంగ్ కాల్ వచ్చిందని బుబ్జి బుజ్జి మాటలు చెప్తారు. సారీ! అని తియ్యగా మాట్లాడుతారు. మనం ఏమీ అడగకముందే తన ఫ్రెండ్‌కు చెప్పబోయే రూ.లక్షల బిజినెస్ ప్లాన్ చెప్తారు. అదేదో బాగుందని ఆసక్తి చూపామో.. నిండా మోసపోయినట్టే. ముందు ఒక బిజినెస్ ఐడియా చెప్తారు. తాను సులువుగా రూ.కోట్లు సంపాదించానని వివరిస్తారు.
తాను చాలా బిజీ అన్నట్టు కాల్ కట్ చేసి, కొన్ని రోజులకు బిజినెస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సాప్ చేస్తారు. మళ్లీ కాల్ చేసి ఆప్యాయంగా మాట్లాడుతూ ఐడియా నచ్చితే రంగంలోకి దిగాలని భరోసా ఇస్తారు. సోషల్ మీడియా నకిలీ ప్రొఫైళ్ల లింక్‌లు పంపి చెక్ చేసుకోవాలని నమ్మిస్తారు. నమ్మితే ఖతం. నిట్టనిలువునా ముంచేస్తారు. దీన్నే ‘పిగ్-బచరింగ్’ అంటారు. దీనర్థం.. వధించేముందు పందిని కొవ్వు పట్టేలా మేపటం. మన భాషలో చెప్పాలంటే.. బలిచ్చే ముందు పొట్టేళ్లను కొవ్వు పట్టేలా మేపటం అన్నమాట. ఇలాంటి మోసాలతో దేశవ్యాప్తంగా నిరుడు రూ.10 వేల కోట్లు సైబర్ నేరగాళ్లు దండుకున్నట్టు అంచనా. నిరుడు నమోదైన అన్ని సైబర్ నేరాల్లో పిగ్ బచరింగ్ వాటా 56 శాతం.
ఎలా నమ్మిస్తారంటే..
బాధితుల ఎంపిక దగ్గర్నుంచి, వారు ఎక్కడ పని చేస్తున్నారు? వారి ఇష్టాలు, అయిష్టాలపై, సోషల్ మీడియా అకౌంట్స్ అధ్యయనం చేసిన తర్వాతే టార్గెట్ చేయటం ఈ కొత్త స్కామ్‌లో ప్రధాన అంశం. మనతో మాట్లాడే వ్యక్తి ఎవరో మనకు తెలియకపోయినా.. మన ఇష్టాలు, మన ఆలోచనలకు తగ్గట్లుగా మాట్లాడటం ప్రారంభిస్తే.. వారిపై తెలియని నమ్మకం కుదురుతుందనేది సైబర్ నేరగాళ్ల ప్రాథమిక సూత్రం. రాంగ్‌కాల్‌తో మొదలై.. బిజినెస్ ఐడియా, ఇన్వెస్ట్మెంట్, పార్ట్‌టైమ్ జాబ్, ఫ్రెండ్షిప్, గిఫ్టులు అంటూ సైబర్ మోసగాళ్లు మాటలు చెప్తారు. మోసగాళ్లు అని తెలిసేలోపు సర్వం దోచేస్తారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
- ఆన్లైన్లో వచ్చే లాటరీలు, కూపన్లతో ధనవంతులు అవ్వరు. కష్టపడితేనే డబ్బు సంపాదించగలమనే విషయాన్ని గుర్తించాలి. సులువుగా వచ్చే డబ్బు కోసం అత్యాశకు పోతే తీవ్రంగా నష్టపోతారు.
- అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్లకు స్పందించకండి.
- తెలియని నంబర్ల నుంచి రాంగ్ కాల్స్ వస్తే తక్షణమే కట్ చేయండి.
- ఆధార్, బ్యాంక్ వివరాలు చెప్పొద్దు.
- క్రిప్టో ట్రేడింగ్‌లో పెట్టుబడి, పార్ట్‌టైమ్ జాబ్, ఇంట్లో కూర్చోని సంపాదించొచ్చు, రివ్యూలు ఇస్తే చాలు.. వంటి వాటిని ఎవరైనా మీతో మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారని గ్రహించాలి.
పిగ్-బచెరింగ్.. చైనా నెట్వర్క్
ఇటీవల మోసపోయిన బాధితుల ప్రొఫైల్స్ విశ్లేషిస్తే దేశవ్యాప్తంగా ఈ స్కామ్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఈ క్రమంలో పిగ్-బచ్చెరింగ్కు పాల్పడుతున్న 18 మంది సైబర్ నేరగాళ్లను గుర్తించి అరెస్టు చేశాం. వారిని విచారించగా ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉన్న సైబర్ లింక్‌లు వెలుగులోకి వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయగా చైనా నుంచి ఈ నెట్వర్క్ నిర్వహిస్తున్నట్టు గుర్తించాం. మన దేశంలో ఆయా రాష్ర్టాలకు చెందిన వారిని సైబర్ నేరగాళ్లు భారీగా రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు తెలిసింది. రాంగ్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. – ఏడీజీ శిఖాగోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

