ధర్మారం/పెబ్బేరు/తెలకపల్లి, జూన్ 25: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని, ఈ అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మొట్టె లక్ష్మీశంకరయ్య ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బీజేపీ అనుబంధ యూత్ నాయకుడు గంగిపల్లి స్వామితోపాటు, యువకులు, మహిళలు సుమారు 200 మంది పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని గుమ్మడం, పాతపల్లి, రంగాపురం, చెలిమిల్ల గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీల కార్యకర్తలు హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని బొప్పల్లి గ్రామంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ బిచ్చలు, కొండలరావు, నాగుల్రావు, సురేశ్రావుతోపాటు పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.