హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): బీఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (ఆర్ఎస్పీ)తోపాటు వందలాది మంది ముఖ్యనేతలు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బీఎస్పీ రాష్ట్ర, జిల్లా, పార్లమెంట్ నియోజకవర్గ, అసెంబ్లీ స్థాయి నాయకులతోపాటు ఆ పార్టీలో వివిధ విభాగాలకు చెందిన ముఖ్యనేతలు ఉన్నారు.
బీఆర్ఎస్లో చేరిన బీఎస్పీ వివిధ హోదాల్లోని రాష్ట్ర స్థాయి బాధ్యుల వివరాలు…
కందికంటి విజయ్ కుమార్, విజయ్ ఆర్య, దాసరి హనుమయ్య, (రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు) పూదరి సైదులు, అరుణ రాణి, నర్రా నిర్మల, జకని సంజయ్, మల్లేశ్ యాదవ్ (రాష్ట్ర కార్యదర్శులు), రాజరత్నం (రాష్ట్ర కోశాధికారి), శ్యాంరావ్ జాడే, పుట్టల శీలజ (రాష్ట్ర మాజీ సభ్యులు) ఎం కేశవరావు, మందశ్యామ్ (నాగర్‌కర్నూల్, వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు) ముస్త్యాల కిషన్ (ఆర్ఎస్పీ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు), మహేందర్ నాయక్ (ఆర్ఎస్పీ గిరిజన సేన రాష్ట్ర అధ్యక్షుడు), జిల్లా అధ్యక్షులు నటరాజ్ (సంగారెడ్డి), సునీల్ రుద్రవరం(సికింద్రాబాద్), చాట్ల చిరంజీవి (హైదరాబాద్), అమ్మఒడి శ్రీనివాస్ (హన్మకొండ), మేకల రవీందర్ (కరీంనగర్), పొన్న జనార్దన్ (మెదక్), మధు మహరాజ్ (భద్రాద్రి),కొండా భీమయ్య (సూర్యాపేట), లెందుగూరే శ్యాంరావు (కుమ్రంభీం), జిల్లా ఇన్చార్జిలు ఆదిమల్ల గోవర్ధన్ (నల్గొండ), ఉప్పల జహంగీర్ (యాదాద్రి), తాళ్లపల్లి వెంకటస్వామి (జనగాం), ఓంకార్ యాదవ్ (హన్మకొండ), ముర్మూరు శేఖర్ (పెద్దపల్లి) కె.బ్రహ్మయ్య (నాగర్ కర్నూల్), తోకల కృష్ణ (మహబూబ్‌నగర్), జిల్లా ప్రధాన కార్యదర్శులు మల్లేశ్ గౌడ్ (సంగారెడ్డి), కంకం బాబు (గద్వాల్),సుజయ్ కుమార్ (జనగాం) తదితరులు ఉన్నారు.