మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ వైపు క్యూ కడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో.. మహబూబ్నగర్ జిల్లా బీజేపి అధికార ప్రతినిధి సత్యం యాదవ్, కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులు జి. పెద్ద రాములు నేతృత్వంలో వివిధ గ్రామాలకు చెందిన 300 మంది బీజేపి ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేస్తున్నారు. అధికార పార్టీ అభివృద్ధి విధానాలు నచ్చి, బీజేపీ నేతల తీరుకు విసుగుచెంది మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు.
పార్టీలో చేరిన వారిలో యాదవ సంఘం ముఖ్య నాయకులు ఎల్. శ్రీనివాస్ యాదవ్, రాఘవేందర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రవికుమార్ యాదవ్,పి.సాయితేజ యాదవ్, అఖిలేష్ యాదవ్, పవన్ కుమార్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, విగ్నేష్ యాదవ్, సాయికిరణ్ యాదవ్, అభిషేక్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, MUDA చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, జిల్లా రైతు బంధు సహకార సంఘం సభ్యుడు మల్లు నర్సింహా రెడ్డి, కౌన్సిలర్ యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.