Home Guards | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 2న తమ డిమాండ్ల సాధనకు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శాంతియుతంగా నిరసనకు సన్నద్ధమవుతున్నారు. తమకు అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి ఉన్నా తమ సంక్షేమం గురించి, జీతభత్యాల గురించి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షంలో హోంగార్డులను ఊరించిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చాక వినతిపత్రాలు తీసుకునేందుకూ ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. ఇతర ఉద్యోగ సంఘాలతో పాటు హోంగార్డులను కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇవే ప్రధాన డిమాండ్లు