రంగారెడ్డి, జూన్ 2 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కాంగ్రెస్ నాయకుల పాదాలు పట్టే పరిస్థితి వచ్చింది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఎక్లాస్పేట్కు ప్రేమ్‌రాజ్ రాష్ట్ర సాధనలో భాగంగా ప్రాణాలను విడిచారు.
ఆయన భార్య లక్ష్మికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చింది. సోమవారం సన్మాన కార్యక్రమంలో లక్ష్మి ఎమ్మెల్యే శంకర్ కాళ్లు మొక్కగా ఆయన వారించలేదు.