కొండాపూర్, జూన్ 20 : మాదాపూర్ ఐటీ కారిడార్లోని టెక్ మహీంద్రా క్యాంపస్లో నిర్వహించిన హైసా ప్రాజెక్ట్ ద్రోణ 2.0 స్నాతకోత్సవ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతిష్టాత్మక ‘ప్రభావ పురసారం’ అవార్డు అందుకున్నది. టాస్ సహకారంతో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు చేపట్టిన కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటీ అత్యధిక సంఖ్యలో అధ్యాపకుల సర్టిఫికేషన్లు నమోదు చేసి ఈ గౌరవాన్ని దకించుకున్నది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీఎస్ఐటీ విభాగాలకు చెందిన అధ్యాపకులు ప్రాజెక్ట్ ద్రోణ 2.0 కింద నిర్వహించిన కఠినమైన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లను విజయవంతంగా పూర్తి చేయడంతో ఈ అవార్డు వరించింది.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్ కుమార్రెడ్డి, విశ్వన్ ఏఐ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఆర్ఐటీ వ్యవస్థాపక కార్యదర్శి, మలాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధ్యాపకులు విద్యార్థులను తీర్చిదిద్దడంలో టాస్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేరొన్నారు. సంస్థ సాధించిన ఈ విజయంపై చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి ధీరేన్ రెడ్డి, అనుశ్రేయారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రాధికాదేవి హర్షం వ్యక్తంచేశారు. ఏఐ ఆధారిత విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత శిక్షణలో ఎంఎల్ఆర్ఐటీ ముందంజలో కొనసాగుతున్నదని తెలిపారు.