హైదరాబాద్, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ): మార్క్‌ఫెడ్‌లో ఒకేసారి 13 మంది అధికారులను బదిలీ చేస్తూ మార్ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ స్థానాల్లో అందరూ రిపోర్ట్ చేయగా.. హెడ్ ఆఫీస్‌లో చీఫ్ ఫెర్టిలైజర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న రేఖ మాత్రం రిపోర్ట్ చేయలేదని తెలిసింది. మారెట్లో కీలక విభాగాలైన ఫెర్టిలైజర్, ప్రొక్యూర్మెంట్ విభాగాలకు కొత్త మేనేజర్లను నియమించారు. చీఫ్ ఫెర్టిలైజర్ మేనేజర్ రేఖ స్థానంలో నల్లగొండ డీఎం జ్యోతి, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ చంద్రశేఖర్ స్థానంలో మహబూబ్‌నగర్ డీఎం నరసింహారావును నియమించారు. ఆదిలాబాద్ డీఎం ప్రవీణ్‌రెడ్డిని హెడ్ఆఫీస్లో చీఫ్ అకౌంట్ ఆఫీసర్‌గా నియమించారు. చీఫ్ ఫెర్టిలైజర్ మేనేజర్ రేఖను రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల డీఎంగా బదిలీ చేశారు. రిక్రూమెంట్ మేనేజర్‌గా ఉన్న చంద్రశేఖర్‌ను మేడ్చల్, సంగారెడ్డి డీఎంగా బదిలీచేశారు.
హెడ్ఆఫీస్లో చీఫ్ అకౌంట్ ఇన్చార్జి ఆఫీసర్‌గా ఉన్న బాలకృష్ణను యాదాద్రి, నల్లగొండ, సూర్యాపే ట జిల్లాల డీఎంగా నియమించారు. ఖమ్మం, కొత్తగూడెం డీఏం సునీతను సిద్దిపేట, మెదక్ డీఎంగా బదిలీచేశారు. నిజామాబాద్ డీఎం మహేశ్‌కుమార్‌ను ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డీఎంగా బదిలీచేశారు. మహబూబాబాద్ డీఎంగా ఉన్న శ్యామ్‌కుమార్‌ను ఖమ్మం, కొత్తగూ డెం డీఎంగా బదిలీచేశారు. సంగారెడ్డి, మేడ్చల్ డీఎంగా ఉన్న శ్రీదేవిని హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి డీఎంగా బదిలీచేశారు. రంగారెడ్డి, వికారాబాద్ డీఎంగా ఉన్న తమీనాతహసీనాను మహబూబ్‌నగర్ డీఎంగా బదిలీచేశారు. సిద్దిపేట, మెదక్ డీఎంగా ఉన్న క్రాంతిని నిజామాబాద్ డీఎంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.