హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి మానేటి ప్రతాప్‌రెడ్డి, సహ ఎన్ని కల అధికారి లక్కిరెడ్డి సంజీవరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా రామగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంజిరెడ్డి స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని అంజిరెడ్డి తెలిపారు. తాజా పదోన్నతుల్లో ఒకే ఉపా ధ్యాయుడు ఒకటి కంటే ఎక్కువ పదోన్నతులు పొందడంతో ఇతర టీచర్లకు అన్యాయం జరిగిందని, దీంతో మిగిలిన పోస్టులకు కూడా పదోన్నతులు కల్పించాలని, ఆ తర్వాతే ఎస్జీటీల బదిలీలు చేపట్టాలని అంజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరా రు. సమావేశంలో టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, నేతలు కావలి అశోక్‌కుమార్, ద్రాక్షపు విష్ణుమూర్తి, కటకం రవికుమార్, సుంకిశీల ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.