హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్‌బజార్ : అఖిల భార త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడిగా టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఎన్నికయ్యారు. ఈ సారి జాతీయ కార్యవర్గంలోకి తెలంగాణ నుంచి నలుగురికి చోటు దక్కింది. మారం జగదీశ్వర్‌తోపాటు, టీఎన్జీవో రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ(ముజీబ్), అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐఎస్జీఈఎఫ్ 18వ జాతీయ సమావేశాలు మహారాష్ట్రలోని షిరిడీలో ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహిస్తుండగా, 28 రాష్ర్టాల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని తీర్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యో గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు ఏఐఎస్జీఈఎఫ్ పిలుపు ఇచ్చింది. ఉద్యోగులంతా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని సంఘం జాతీయ అధ్యక్షుడు సుభాశ్లాంబ, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ పిలుపు ఇచ్చారు.