కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 20: పోలీసులకు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఓ విద్యా వలంటీర్తోపాటు గ్రామస్తుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
బర్సుర్ తహసీల్ ఇన్స్పెక్టర్ సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. దంతేవాడ జిల్లా తొడ్మ గ్రామానికి చెందిన విద్యా వలంటీర్(శిక్షాదూత్) బామన్ కశ్యప్(28), అదే గ్రామానికి చెందిన అనీష్రామ్ పోయం(38)లను బుధవారం సాయంత్రం మావోయిస్టులు అపహరించుకెళ్లారు. తర్వాత అదే గ్రామ సమీపంలో వారిద్దరినీ హత్య చేశారు.