హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : మావోయిస్టు పార్టీతోపాటు, ప్రజలపై కొనసాగుతున్న విచక్షణారహిత సైనిక దాడులను వ్య తిరేకిస్తూ ఈ నెల 22న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏడాదిన్నరగా జార్ఖండ్-బీహార్ అడవుల్లోని ఆదివాసీ గ్రామా లు బాంబులతో దద్దరిల్లుతున్నాయని, అక్కడి దాడులను ఖండిస్తూ, వారికి అండగా ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) ప్ర జా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రత్యేక కమాండో బలగాల దాడులను ఖండించాలని సూచించారు.