Maoist Sudhaker | రాయ్‌పూర్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువకముందే.. మరో అగ్రనేతను పోలీసులు కాల్చేశారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ నేషనల్ పార్కు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్(65) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. 40 ఏండ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఆయన ఉన్నారు. 2004లో నాటి ఏపీ ప్రభుత్వంతో సుధాకర్ శాంతి చర్చల్లో పాల్గొన్నారు. సింహాచలం అలియాస్ సుధాకర్‌పై రూ. 50 లక్షల రివార్డు ఉంది. సుధాకర్ పూర్తి పేరు తెంటు లక్ష్మీనరసింహాచలం. ఇక ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.