కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 21: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతిచెందారు.అతడిని మావోయిస్టు జనతా సర్కార్ అధ్యక్షుడు గుడ్డీ కవాసి (34)గా పోలీసులు గుర్తించారు .అతడిపై రూ.లక్ష రివార్డు ఉన్నట్టు వెల్లడించారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, బైరామ్‌గఢ్ బ్లాక్‌లోని కేశ్కుతుల్-కేశముండా అడవుల్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఎన్కౌంటర్ చో టుచేసుకుంది. ఇరువర్గాల మధ్య సుమారు 20 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయి. కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలం నుంచి ఓ మావోయిస్టు మృతదేహంతోపాటు పేలు డు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.