ఎదురు కాల్పుల్లో మావోయిస్టు హతం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అడవుల్లో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేత హతమయ్యాడు. నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్ బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
కొత్తగూడెం క్రైం, ఆగస్టు 21: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అడవుల్లో సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేత హతమయ్యాడు. నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్ బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో భట్బేడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు పారిపోయారు. ఈ ఘటనలో మావోయిస్టు మృతదేహంతోపాటు 315 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు నారాయణ్‌పూర్ ఏఎస్పీ నిఖిల్ రకోచా వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

