నిర్మల్ అర్బన్, నవంబర్ 4 : నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేసిన పలువురికి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం వాంతులు, విరేచనాలు అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన 13 మంది ప్రభుత్వ దవాఖానకు, స్థానిక ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. ఇందులో ఏడుగురు సోమవారం డిశ్చార్జి అయ్యారు. మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు. హోటల్లో ఆహారం తిన్న తర్వాతనే తమకు వాంతులు, విరేచనాలు అయినట్టు బాధితులు చెబుతున్నారు. హోటల్లో తిన్న ఆహారంతోనే ఫుడ్ పాయిజన్ కావడం తో యాజమాన్యం హోటల్‌ను తెరవలేదు.