హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడికి తెగబడడాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ నివాసానికి చేరుకున్న వారు కవితకు సంఘీభావం ప్రకటించారు. కవిత నివాసానికి వెళ్లిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, గణేశ్ బిగాల, షకీల్ తదితరులు ఉన్నారు. తప్పుడు ఆరోపణలతో అప్రతిష్ట పాల్జేసేందుకు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పుకొడతామని వారు హెచ్చరించారు.