మహబూబాబాద్ రూరల్, జూన్ 18: మానుకోట తహసీల్దార్ ఇమాన్యుయేల్పై ఆదివారం దాడి జరిగింది. పట్టణ శివారు సాలారుతండా వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని జిల్లా కోర్టు ఏర్పాటు కోసం కేటాయించారు. ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి స్థలాన్ని పరిశీలించడానికి వస్తున్న క్రమంలో ముందుగా తహసీల్దార్ మార్కింగ్ ఇవ్వడానికి సిబ్బందితో వెళ్లారు.
ఈ నేపథ్యంలో సాలార్‌తండా వాసులు ఈ భూమి తమదేనంటూ ఇక్కడ ఎలాంటి సర్వే నిర్వహించరాదని తహసీల్దార్‌తో ఘర్షణకు దిగారు. గుగులోతు ప్రవీణ్, నవీన్ అనే యవకులు తహసీల్దార్‌పై దాడి చేసి స్వల్పంగా గాయపర్చారు. వెంటనే తహసీల్దార్‌ను స్థానిక ఏరియా దవాఖా ఏరియా దవా నకు తరలించారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు టౌన్ ఎస్సై దీపికారెడ్డి తెలిపారు.