పెద్దపల్లి, డిసెంబర్ 11: పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం వరించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఉత్త మ పంచాయతీలకు దీన్‌దయాళ్ ఉపాధ్యా య్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది.
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 2022-23 సంవత్సరానికిగాను రెండో ర్యాంకు వచ్చింది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎన్పీఏ (నేషనల్ పంచాయతీ అవార్డు)ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అందుకున్నారు. పురస్కారంతోపాటు రూ.75 లక్షల నగదు పారితోషికం అందజేశారు. నగదు పారితోషికాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు.