
మనోహరాబాద్, జనవరి 12: మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో మల్లాది జైపాల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు.. మేడ్చల్‌లోని నివాసంలో ఆయనను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.3.40 కోట్ల నగదు, నగలు, మరిన్ని స్థిరాస్తుల పత్రాలు లభించాయి. దీంతో అతడిని అరెస్టు చేసి అడిషనల్ స్పెషట్ జడ్జి ఎదుట హాజరు పరిచినట్టు అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన జైపాల్‌రెడ్డి.. పదోన్నతిపై మనోహరాబాద్ ఎంపీడీవోగా 2019లో బాధ్యతలు స్వీకరించాడు. ఇటీవల జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో తాను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోనున్నట్టు ప్రకటించాడు.
న్యూఢిల్లీ: న్యూస్ రేటింగ్స్‌ను వెంటనే విడుదల చేయాలంటూ బ్రాడ్‌కాస్టర్స్ ఆడియెన్స్, రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్)ను కేంద్ర సమాచార శాఖ ఆదేశించింది. 2020 అక్టోబర్‌లో టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్పీ) కుంభకోణం వెలుగులోకి రావడంతో న్యూస్ రేటింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. తర్వాత న్యూస్ రేటింగ్స్ కోసం పాటించే విధానాలను బార్క్ పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఈ నేపథ్యంలోనే న్యూస్ రేటింగ్స్‌ను వెంటనే విడుదల చేయాలంటూ తాజాగా కేంద్ర సమాచార శాఖ కోరింది.
వ్యాక్సిన్ తీసుకోని వారిపై హెల్త్ ట్యాక్స్మాంట్రియెల్: కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోని వారిపై పన్ను విధించేందుకు కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ సిద్ధమైంది. అలాంటి వారిపై కొత్త హెల్త్ ట్యాక్స్ విధిస్తామని క్యూబెక్ ప్రీమియర్ ఫ్రాంకోయిస్ లెగాల్ట్ వెల్లడించారు.